పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్ట్

పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్ట్

కోల్కతా : ఉపాధ్యాయ నియామకాల్లో నగదు అక్రమ బదిలీకి పాల్పడ్డారనే ఆరోపణపై మంత్రి పార్థ ఛటర్జీ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్టు చేసింది. గత రెండు రోజులపాటు విచారించారు. ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసంలో సుమారు రూ.20 కోట్ల నగదును ఈడీ శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకుంది. ఆమెనూ శనివారం ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవినీతి జరిగినట్లు కేసు నమోదైంది. జూన్ 29న ఈడీ అధికారులు రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. చాలా మంది పలుకుబడిగల వ్యక్తులు ఈ కేసులో నిందితులు. పార్థ ఛటర్జీ నియ మిం చిన ఒక ఉన్నతాధికార పర్యవేక్షణ సమితి ఈ అవినీతికి మూలమని కలకత్తా హైకోర్టు గతంలో పేర్కొంది. కోర్టు కు సమితి సభ్యులు ఇచ్చిన వాంగ్మూలాలు పరస్పర విరు ద్ధం గా ఉండటంతో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. పార్థ ఛటర్జీ మే 18న, మే 25న సీబీఐ దర్యాప్తునకు హాజరయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos