పాల్ నామ పత్రాల అంగీకారం

నరసాపురం: నరసాపురం విధానసభ, లోక్సభ స్థానాలకు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కేఏ.పాల్ దాఖలు చేసిన నామపత్రాల్ని ఎన్నికల అధికార్లు అంగీక రించినట్లు ఆయన ఇక్కడ మాధ్యమ ప్రతినిధులకు వెల్లడించారు. అయితే తన నామినేషన్ను తిరస్కరించేలా వైకాపానేత విజయసాయి రెడ్డి కుట్ర పన్నారని పాల్ ఆరోపించారు. జగన్కి ఓటేస్తే అవినీతిని సమర్థించినట్లేనని , పవన్కు ఓటేస్తే గ్లాసు పగిలిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. పవన్కు అసలు ప్రజాసేవ చేసే ఉద్దేశమే లేదని ఆరోపించారు. తనను గెలిపిస్తే ఏడాదిలో నరసాపురం లోక్సభ నియోజకవర్గాన్ని అమెరికాలా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos