మోదీ విమాన సంచారానికి పాక్‌ అనుమతి కోరిన భారత్‌

మోదీ విమాన సంచారానికి పాక్‌ అనుమతి కోరిన భారత్‌

న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీ న్యూయార్క్‌ పర్యటనకు వీలుగా పాకిస్థాన్‌ గగనతలంలో ప్రయాణానికి భారత్‌ ఆ దేశం అనుమతి  కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఇంకా స్పందన లభించాల్సి ఉంది. జమ్ము- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతి పత్తి రద్దు తర్వాత పాకిస్థాన్‌ తమ గగనతలంలోకి భారత విమానాల సంచా రాన్ని నిషేధించింది. తమ వినతికి సానుకూల స్పందన లభించక పోతే అది అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) నిబంధనలకు వ్యతి రేక మవుతుందని అధికారులు తెలిపారు. యుద్ధం లేదా అత్యయిక పరిస్థితిలోనే  గగన తలంలోకి విమానాన్ని అనుమతించడం పై ఏకపక్ష నిర్ణ యాల్ని  తీసుకోవచ్చు. భారత్‌ ఐసీఏఓకు పాక్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే ఆ దేశం భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నెల రోజుల కిందట రాష్ట్ర పతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మూడు దేశాల పర్యటన సందర్భంగా కూడా పాక్‌ గగనతలంలో విమాన సంచారానికి అనుమతి ఇవ్వలేదు. ఈ  నిర్ణయాన్ని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆమోదించారని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos