అమెరికాది ద్వంద్వ వైఖరి

అమెరికాది ద్వంద్వ వైఖరి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పట్ల అమెరికా అవలంభిస్తున్న విధానాలను ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తప్పు పట్టారు. ఒకప్పుడు ముజాహిద్దీన్ను పెంచి పోషించిన అమెరికాయే ఇప్పుడు దాన్ని తప్పు పడుతోందని వ్యాఖ్యానించారు. ఎనిమిదో దశకంలో ఆఫ్ఘనిస్తాన్ను సోవియేట్ రష్యా స్వాధీనం చేసుకున్నపుడు సోవియేట్కు వ్యతిరేకంగా పోరాడేందుకు పాక్కు చెందిన ముజా హిద్దీన్లను జిహాదీలుగా అమెరికా వాడుకుందని విమర్శిం చారు. ఆ జిహాదీలకు పాకిస్థాన్ శిక్షణ ఇచ్చినా, దానికైన ఖర్చును అమెరికాకు చెందిన సీఐఏ భరించిందని వెల్లడించారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్లోని ఏకంగా అమెరికా దళాలు తిష్ట వేసి తన వాదనను మార్చేసిందన్నారు. ఒకప్పుడు ఆప్ఘనిస్తాన్లో అమెరికా తరపున పోరాడిన వారినే ఇప్పుడు అమెరికా ఉగ్రవాదులుగా చూస్తోందని ధ్వజమెత్తారు. వాస్తవానికి ఇలాంటి విషయాల్లో పాక్ నిష్పక్ష పాతంగా ఉంటేనే మేలని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఆ వర్గాలే దేశానికి వ్యతిరేకంగా మారాయన్నారు. ఆ ఉగ్రవాదుల పోరులో సుమారు 70వేల మందిని, వంద బిలియన్ల డాలర్లు వరకూ కోల్పోయిందన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో పరాజయం పాలైన అమెరికా ఇప్పుడు తమని నిందిస్తోందన్నారు. పాకిస్థాన్కు అన్యాయమే జరిగిందని తేల్చి చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos