పాక్‌లో హిందూ యువతి అనుమానాస్పద మృతి..

పాక్‌లో హిందూ యువతి అనుమానాస్పద మృతి..

పాకిస్థాన్‌లో మైనారిటీలైన హిందువులపై రోజురోజుకు దాడులు తీవ్రతరమవుతున్నాయి.ముఖ్యంగా హిందూ అమ్మాయిలపై దాడులు,హత్యలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.కొద్ది రోజుల క్రితం సిక్కు మతానికి చెందిన యువతిని అపహరించిన ఘటన మరువక ముందే హిందూ మతానికి చెందిన ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది.లర్కానాలోని బబీ అసిఫా డెంటల్కాలేజీలో  మొదటి సంవత్సరం మెడిసిన్ చదువుతున్న నమ్రితా చాందిని అనే విద్యార్థిని తన హాస్టల్ గదిలో పడి ఉండటం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నమ్రతాది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.కానీ నమ్రతా సోదరుడు  సోదరుడు విశాల్ స్వయంగా వైద్యుడు కావడంతో నమ్రతా మృతదేహాన్ని పరీక్షించి అది హత్యే అని ప్రాథమిక అంచనాకు వచ్చాడు. అది ఆత్మహత్యకాదని ఆత్మహత్యకు హత్యకు తేడా ఉంటుందని చెప్పారు.ఆమె గొంతు చుట్టూ కేబుల్ వైర్ గుర్తులు ఉన్నట్లు తెలిపారు డాక్టర్ విశాల్. ఇక చేతులపై కూడా కేబుల్ వైర్ గుర్తులు ఉన్నట్లు తేలిందని చెప్పారు. శరీరంపై కేబుల్ వైర్ గుర్తులున్నాయని అయితే నమ్రితా స్నేహితురాలు మాత్రం ఆమె చూసేసరికి గొంతు చుట్టూ చున్నీ ఉన్నట్లు చెబుతోందని డాక్టర్ విశాల్ చెప్పారు.నమ్రతా మృతిపై పాక్ లో నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కరాచీ వీధుల్లో హిందువులు ఆందోళన చేపట్టారు

 

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos