కబడ్డీ వరల్డ్ కప్ పాక్‌కే

కబడ్డీ వరల్డ్ కప్ పాక్‌కే

లాహోర్: ఇక్కడ ఆదివారం జరిగిన కబడ్డీ వరల్డ్ కప్ పోటీల్లో భారత్పై 43-41 స్కోర్ తేడాతో పాక్ నెగ్గింది. హోరాహోరీగా సాగిన పోటీలో తొలు త ఇండియా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తర్వాత పాక్ తన జోరును అందుకుంది. రెండు సెషన్స్లోనూ ఆట రెండు దేశాల మధ్య మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. పాక్ ఆటగాళ్లు బిన్యామీన్, ఇర్ఫాన్ మానా, షఫిక్ చిస్తీలు విజయంలో కీలక పాత్ర పోషించారు. కబడ్డీ వరల్డ్ కప్ తొలిసారి పాకిస్థాన్లో జరిగింది. గతంలో ఆరు సార్లు ఈ టోర్నమెంట్ను ఇండియాలోనే నిర్వహిం చారు. 8 రోజుల పాటు సాగిన పోటీల్ని లాహోర్, ఫైసలాబాద్, కర్తార్పూర్, నాన్కన్ సాహిబ్ నగరాల్లో నిర్వహించారు. ఇండియాతో పాటు ఇరాన్, కెనడా, ఆస్ట్రే లియా, అమెరికా, సియరాలియోన్, కెన్యాలూ పోటీలో తలపడ్డాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos