సోనాలి బింద్రెను కిడ్నాప్ చేయాలనుకున్నా..

సోనాలి బింద్రెను కిడ్నాప్ చేయాలనుకున్నా..

చేతిలో బంతి పట్టుకొని ఇంచుమించు బౌండరీలైన్‌ వద్ద నుంచి రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ రైలులా దూసుకువచ్చి 160 కిలోమీటర్ల వేగంగా బంతులు వేస్తూ ఎంతోమంది మహామహులైన బ్యాట్స్‌మెన్లను క్లీన్‌బౌల్డ్‌ చేసిన పాకిస్థాన్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ బహుభాష నటి సోనాలి బింద్రె అందానికి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.ఇదే విషయాన్ని గతంలో పలుమార్లు మీడియా ఎదుట చెప్పిన అక్తర్‌ తాజాగా మరోసారి సోనాలిని ఎంతగా ఇష్టపడ్డాడో మరోసారి చెప్పుకొచ్చాడు.1996లో బాలీవుడ్ లో తెరకెక్కిన ‘ఇంగ్లీష్‌ బాబు దేసీ మేమ్‌’ అనే సినిమాను చూసి సోనాలీపై అమితమైన ప్రేమను పెంచుకున్నట్లు తెలిపాడు.అప్పటి నుంచి సోనాలిపై విపరీతమైన ప్రేమను పెంచుకున్నానని సోనాలి ఫోటోను పర్స్‌లో పెట్టుకొని ప్రతీరోజూ చూసుకునేవాడినని తెలిపాడు ఈ ఫాస్ట్‌బౌలర్‌.సోనాలిని ఎలాగైనా కలిసి ప్రేమను తెలియజేయాలని ఒకవేళ ప్రేమను ఒప్పుకోకపోతే సోనాలి బింద్రెను కిడ్నాప్ కూడా చేయాలనీ అనుకున్నా అంటూ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు.వరల్డ్ కప్ చిట్ చాట్ లో భాగంగా తన ప్రేమను సరదాగా గుర్తు చేసుకున్నాడు ఈ ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతం ఇండియా – పాక్ మ్యాచ్ కు సంబందించిన చర్చలలో షోయబ్ అక్తర్ చురుగ్గా పాల్గొంటున్నాడు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos