పాక్ పిచ్చి పరాకష్టకు..

పాక్ పిచ్చి పరాకష్టకు..

ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఏదోఒక రూపంలో భారత్‌పై విషం కక్కుతున్న ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం తాజాగా పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు తపాల సేవలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.370 రద్దు అనంతరం భారత్‌తో వాణిజ్య సంబంధాలు,విమాన సర్వీసులు తదితర అన్ని రకాల సంబంధాలు తెంచుకున్న పాకిస్థాన్‌ తాజాగా తపాల సేవలు రద్దు చేసుకుంది.జమ్ము కశ్మీర్‌ అంశంలో చైనాతో సహా ఏదేశం కూడా పాకిస్థాన్‌కు మద్దతుగా నిలవకపోవడం చివరకు ఐరాసలో కూడా పాకిస్థాన్‌కు చేదు అనుభవం ఎదురుకావడంతో భారత్‌పై ఈ విధంగా విషం చిమ్ముతోంది. పాకిస్థాన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో రెండు దేశాల మధ్య సాంస్కృతిక మరియు సాహిత్యం పరంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణికి బ్రేక్ పడింది. ముఖ్యంగా ప్రతి నాలుగు నెలలకోసారి ” పంజాబ్ దే రంగ్” అనే మ్యాగజైన్ పంజాబ్‌కు చెందిన గుర్ముఖి లిపిలో ప్రచురితం అవుతుంది. ఈ మాసపత్రిక లాహోర్‌ నుంచి వెలువడుతుంది. భారత్‌లోని పంజాబ్ రాష్ట్ర ప్రజలు ఈ మ్యాగజీన్‌ను బాగా చదువుతారు. భారత్‌లో గుర్ముఖి లిపిలో పబ్లిష్ అయ్యే మ్యాగజీన్లు కానీ పత్రికలు కానీ చాలా అరుదు. అలా గుర్ముఖీ లిపిలో ప్రచురితం అవుతుంది పంజాబ్ దే రంగ్ మ్యాగజీన్ . ఇది పాకిస్తాన్‌లో ప్రచురితం అవుతుంది.ఈ మధ్యే భారత్‌లోని పంజాబ్‌కు పంజాబ్ దే రంగ్ మాసపత్రికకు సంబంధించి 70 కాపీలను భారత్‌కు పంపగా అవి తిరిగి తమ వద్దకు చేరుకున్నాయని పంజాబ్ దే రంగ్ మ్యాగజీన్ చీఫ్ ఎడిటర్ ఇషాన్ హెచ్ నదీమ్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos