పాక్‌తో చర్చలా?

పాక్‌తో చర్చలా?

న్యూ ఢిల్లీ: శాంతి చర్చలకు తాము ఇచ్చిన ఆహ్వానాన్ని భారత్ అంగీకరించినట్లు పాకిస్థాన్ మాధ్యమాల్లో వెలువడిన వార్తల్ని భారత్ విదేశాంగ శాఖ గురువారం ఇక్కడ కొట్టి పారేసింది. ‘పాక్ ప్రధాని, విదేశాంగ శాఖ ఇటీవల భారత ప్రధాని, విదేశాంగ మంత్రికి శుభాకాంక్షలు తెలిపినందుకు మాత్రమే భారత్ స్పందించింది. దేశాల మధ్య నమ్మకం పెరగాలని, విరోధం, ఉగ్రవాదం, హింస తొలగిపోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే, ఉగ్రవాదం, హింస నీడలో ఉండని వాతా వరణం నెలకొనాలని పేర్కొన్నాం. పాకిస్థాన్తో చర్చల ప్రతి పాదన చేయలేద’ని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ స్పష్టీక రించారు. ‘చర్చల కోసం తాము ఇచ్చిన పిలుపునకు భాతర ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారని, ప్రాంతాల శ్రేయస్సు కోసం తమ దేశంతో పాటు అన్ని దేశాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమన్నారని’ పాకిస్థాన్ మాధ్యమాలు పేర్కొన్నాయి. రెండు వారాల కిందట పాక్ ప్రధాని, విదేశాంగ మంత్రి వేర్వేరుగా భారత్కు లేఖలు రాసి చర్చలకు ఆహ్వానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos