విపక్షాల్ని ఊడ్చేస్తున్న చీపురు పక్షం

విపక్షాల్ని ఊడ్చేస్తున్న చీపురు పక్షం

న్యూఢిల్లీ : ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ విపక్షాల్ని అవతలకు ఊడ్చి పారేస్తోంది. ఏడు లోకసభ స్థానాల పరిధిల్లోని శాసనసభ నియోజక వర్గాల్లోనూ ఆప్ దుమ్ము దులుపుతోంది. 54 స్థానాల్లో ఆప్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతోంది. భాజపా 15 స్థానాల్లోనే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. చాందినీ చౌక్ లోకసభ పరిధిలోని ఎనిమిది దిగువ సభ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం వైపు ఆప్ దూసుకెళ్తోంది. ఈస్ట్ ఢిల్లీ లోకసభ పరిధిలో కూడా చీపురు పార్టీ 7 స్థానాల్లో దూసుకెళ్తుండగా, బీజేపీ మూడు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. న్యూఢిల్లీ లోకసభ పరిధిలో కూడా ఆప్ 7 స్థానాల్లో ముందంజలో ఉండగా, భాజపా మూడు స్థానాల్లోనే తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.దక్షిణ ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ విజృంభిస్తున్నారు. 7 సీట్లలో కేజ్రీవాల్ ఉండగా, కమలం మూడు స్థానాల్లోనే బలం చూపే దిశగా ఉంది. పటమటి ఢిల్లీలో ఆప్ ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, భాజపా మూడు స్థానాల్లో ఉంది. నైరుతి ఢిల్లీ పరిధిలో ఆప్ ఆరు స్థానాల్లో, భాజపా మూడు స్థానాల్లోనే ముందంజలో ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos