మందేసి జైలుకెళ్లినోళ్లు ఎంత మందో తెలుసా?

మందేసి జైలుకెళ్లినోళ్లు ఎంత మందో తెలుసా?

దశాబ్ద కాలంగా స్మార్ట్‌మొబైల్‌,సామాజిక మాధ్యమాలు వినియోగించే ప్రజల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో మనుషులు మధ్య హద్దులు మాయమయ్యాయి.దేశంతో పాటు విదేశీయులతో సైతం యువత స్నేహాలు పెంచుకునే స్థాయికి సాంకేతికత ఎదిగిపోయింది.అలా మెల్లిగా పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డ భారతదేశ యువత వీకెండ్‌ పార్టీలని,రేవ్‌పార్టీలని మత్తుకు బానిసలపై భవిష్యత్తును శూన్యం చేసుకుంటున్నారు.ఇక వారాంతాల్లో మహానగరాల్లో మందుకొట్టని యువత ఉండదంటే అతిశయోక్తి కాదేమో.అడమగ తేడా లేకుండా యువత పీకలదాక మద్యం తాగి రోడ్లపై రివ్వునూ దూసుకుపోతూ కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా మరికొంత మంది ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు.దీంతో మందేసి రోడ్లపైకి వచ్చే యువతను నియంత్రించాలనే ఉద్దేశంతో వారాంతాల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు నిర్వహించి పట్టుబడ్డ యువతీయువకులకు జరిమానాలు,జైలు శిక్షలు విధిస్తున్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసిందే.తాజాగా విడుదలైన నివేదికలోని గణాంకాల ప్రకారం హైదరాబాద్ లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడి 2,612 మందికి జైలుశిక్షకు గురయ్యారనే వార్త నగరవాసులను షాక్‌కు గురి చేసింది.ట్రాఫిక్ పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఏడాది వ్యవధిలో తాగి వాహనాలు నడిపిన 12900 మందిపై కేసులు నమోదు చేయగా.. వారిలో 12700 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిన 10088 మంది నుంచి రూ.2.68 కోట్ల జరిమానాను విధించగా.. మరో 2612 మందికి జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పులు ఇచ్చింది. ఇంత కఠినంగా ఉన్నప్పటికీ తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గటం లేదంటున్నారు. తాగి వాహనాలు నడుపుతున్న కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న నేపథ్యంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్ని ముమ్మరం చేస్తున్నా.. మందుబాబులు మాత్రం ఏ మాత్రం తగ్గకపోవటం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos