ఓయూలో విద్యార్థినుల ధర్ణా

ఓయూలో విద్యార్థినుల ధర్ణా

హైదరాబాద్: రక్షణ కల్పించాలని డిమాండు చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ వసతి గృహం విద్యార్థినులు శుక్రవారం ధర్నాకు దిగారు. గురు వారం తెల్లవారు జామున ఇంజినీరింగ్ విద్యార్థినుల వసతి గృహంలోకి ఒక ఆగంతుకుడు ప్రవేశించి కత్తితో ఓ విద్యార్థినిని బెదిరించాడు. ఇతరులు గట్టిగా అరవడంతో మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి పరారయ్యాడు. సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగు తున్నాయని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. తమకు రక్షణ కల్పించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా వసతి గృహం ప్రహరీ గోడ ఎత్తు పెంచుతామని, సీసీ కెమెరాల నిఘా, ఎల్ఈడీ దీపాలు, ఏర్పాటు చేస్తామని విశ్వవిద్యాలయ అధికారులు భరోసా ఇచ్చారు. ఇంకా రాత్రి వేళల్లో మహిళా గార్డులనూ నియమిస్తా మని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos