పిల్లి పిల్లలు ఆర్డర్ చేస్తే పులి పిల్ల వచ్చింది..

పిల్లి పిల్లలు ఆర్డర్ చేస్తే పులి పిల్ల వచ్చింది..

ఇంట్లో పిల్లి, శునకాలను పెంచుకోవడం సాధారణమే. కానీ ఒక జంటకు మాత్రం ఈ విషయంలో చేదు అనుభవం ఎదురైంది. వారు పిల్లి పిల్లను ఆన్‌లైన్‌లో కొన్నారు. కానీ అది పులి అని తెలిసి భయపడ్డారు. అంతేకాదు, వారికి తెలియకుండా చేసిన తప్పు చేసి జైలు పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్‌లోని నార్మండీ ప్రాంతం లి హవ్రెకు చెందిన ఓ జంట 2018లో ఆన్‌లైన్‌లో ఓ యాడ్ చూశారు.సవానా జాతికి చెందిన పిల్లి పిల్లను అమ్ముతామంటూ యాడ్‌లో ఉంది. దీంతో వారు యాడ్‌ను చూసి 7వేల డాలర్లు (దాదాపుగా రూ.5.1 లక్షలు) వెచ్చించి ఆన్‌లైన్‌లో పిల్లి పిల్లను ఆర్డర్ చేశారు. అయితే అది పిల్లి కాదు. పులి అని తేలింది.రెండేళ్ల పాటు వారు దాన్ని పెంచుకున్నారు. కానీ దానికి పిల్లి లక్షణాలు కనిపించలేదు. దీంతో వారికి అనుమానం వచ్చి పోలీసులను పిలిచారు. వారు నిపుణులకు అప్పగించి పరీక్షించగా, అది పిల్లి కాదని, సుమత్రా దీవుల్లో ఉండే అరుదైన జాతికి చెందిన పులి అని తేలింది. ఆ విషయం ఆ దంపతులకు తెలియదు. అయినప్పటికీ వారిని నేరం చేసినట్లు భావించి పోలీసులు అరెస్టు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos