విపక్షాల పర్యటనకు ససేమిరా

విపక్షాల పర్యటనకు ససేమిరా

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో విపక్షాల పర్యటనకు అక్కడి అధికార్లు అనుమతి నిరాకరించారు. రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ వినతి ప్రకారం శనివారం కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకేకు చెందిన రాహుల్ సహా గులాం నబీ ఆజాద్, కేసీ.వేణుగోపాల్, ఆనంద్ శర్మ, డి.రాజా, సీతారాం ఏచూరి, తదితరులు ఢిల్లీ విమానాశ్రయాన్ని చేరినట్లు తెలిసింది. అయితే కశ్మీర్లో పర్యటించేందుకు మాత్రం అక్కడి సిబ్బంది అనుమతి నిరాకరించారు. విమానాశ్రయం బయటకు రావడానికి వీల్లేదని తేల్చి చెప్పాయి. వారు పర్యటించదలచిన నిషేధాజ్ఞల్ని విధించారు. కశ్మీర్ మాజీ సీఎం, సీనియర్ నేత గులాంనబీ అజాద్ ఇంటి ముందు భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. లోయ ప్రశాతంగా ఉంటే తమపై ఇన్ని ఆంక్షలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. అమాయక కశ్మీరీ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. విపక్ష నేతల పర్యటనను భాజపా తప్పుబట్టింది. ప్రశాతంగా ఉన్న కశ్మీర్లో అల్లర్లు సృష్టించేందుకే అక్కడ పర్యటిస్తున్నారని ఆరోపించింది. శాంతి, భద్రతల పునరుద్ధరణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యటనను రద్దు చేసుకోవాలని అధికారులు విపక్షాల్ని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos