గురు గ్రామ్ లో ఆపరేషన్ కమల

గురు గ్రామ్ లో ఆపరేషన్ కమల

ముంబై: గురు గ్రామ్ లోని ఓ హోటల్లో ఆపరేషన్ కమల జరిగిందని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సోమవారం ఇక్కడ ఇక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘ఆపరేషన్ కమల కోసం భాజపా సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను, పోలీసు శాఖ ల అధికారుల్ని వినియోగించుకుంటోంది. మహారాష్ట్రలో వారి పప్పులు ఉడక లేదు. భాజపాకు నిజంగా మెజారిటీ ఉంటే ఆప రేషన్ కమల ప్రయత్నాలు ఎందుకు? అత్యుతన్నత న్యాయస్థానం తీసుకునే నిర్ణయంపై మాకు పూర్తి భరోసా ఉంది. అజిత్ పవార్ కు మద్దతు తెలుపుతూ వెళ్లిన వారు తిరిగి వస్తున్నారు. గురు గ్రామ్ లోని ఓ హోటల్ వేదికగా ఆపరేషన్ కమల జరి గింది. ఆదివారం రాత్రి శివసేన, ఎన్సీపీ నేతలు అక్కడకు వెళ్లి వారిని కాపాడారు. భాజపా తమను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసిందని ఆ ఎమ్మెల్యేలు చెప్పార’ని రౌత్ పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos