భారతీయ వంటలపై అమెరికా ప్రొఫెసర్ నోటి దురుసు వ్యాఖ్యలు..

భారతీయ వంటలపై అమెరికా ప్రొఫెసర్ నోటి దురుసు వ్యాఖ్యలు..

భారతదేశంపై,భారతీయులపై పాశ్చాత్య దేశస్థులు అప్పుడప్పుడూ నోటి దురుసు వ్యాఖ్యలు చేస్తూ పైత్యం ప్రదర్శించడం చూస్తూనే ఉంటాం.తాజగా అమెరికాకు చెందిన టామ్‌ నికోలస్‌ అనే ఓ ప్రొఫెసర్‌ భారతదేశ వంటకాలపై నోరుజారి చివాట్లు తింటున్నాడు. భారతీయ వంటకాలు చాలా దారుణంగా ఉంటాయి.. నూనెలు ఎక్కువగా వాడతారు.. అవి కూడా వంటలేనా అంటూ నోటికొచ్చిన మాటలు మాట్లాడాడు. ఈ కామెంట్స్ చేసిన ప్రొఫెసర్‌పై భారతీయ నెటిజన్లు మండిపడ్డారు.నోరు అదుపులో పెట్టుకో అంటూ కొంతమంది విదేశీయులు సైతం చీవాట్లు పెట్టారు. నీ అభిప్రాయం గురించి చెప్పుకో తప్పులేదు.. అంతే కానీ మేమంతా అంటూ మమ్మల్ని కూడా కలుపుతున్నావ్ నీ ఇష్టమేనా అంటూ వారు టామ్‌పై విరుచుకుపడ్డారు.నూనె ఎక్కువ వాడతాం, కారం ఎక్కువగా తింటాం నీకెందుకు అంటూ మండిపడ్డారు. వీరికి మద్ధతుగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ రుచులను ఇష్టపడే మరికొందరు ఆహార ప్రియులు జతకలవడంతో ప్రొఫెసర్‌కు దిమ్మ తిరిగిపోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos