ఎగుమతిపై వేటు.. ఉల్లి రైతు కంట నీరు

ఎగుమతిపై వేటు.. ఉల్లి రైతు కంట నీరు

హొసూరు:ఉల్లి ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించటంతో మెడిసిన్ ఉల్లి ధరలూ తగ్గి రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఒక్క సారిగా ఘాటెక్కినందుకు కేంద్రం వాటి ఎగుమతిని నిషేధించింది. హోసూరు ప్రాంతంలో సుమారు రెండు వేల హెక్టార్లలో మెడిసిన్ ఉల్లిని రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేసి లాభాలను ఆర్జిస్తు న్నారు. ఉల్లి ఎగుమతులు నిషేధానికి 50 కిలోల మెడిసిన్ ఉల్లి బస్తాను రూ.1,800 వరకూ అమ్మడయ్యేది. ఎగుమతులు నిలిచి పోవడంతో ఒక్కో రైతు వద్ద సుమారు వెయ్యి బస్తాల వరకూ మెడిసిన్ ఉల్లి మూలుగు తున్నాయి. సుమారు రూ. 10 లక్షల వరకూ నష్ట పోయినట్లు తట్టిగానపల్లి గ్రామ రైతు రఘు తెలిపారు. మెడిసిన్ ఉల్లి రైతులు రూ.కోట్లలో నష్ట పోతున్నందున ఈ రకం ఉల్లి ఎగుమతిని పునరుద్ధరించాలని ఉల్లి రైతులు కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos