వేటగాడి అరెస్టు

వేటగాడి అరెస్టు

హొసూరు : డెంకణీకోట అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులను వేటాడుతున్న ఇద్దరిని అటవీ శాఖ సిబ్బంది వెంబడించారు. వారిలో ఒకడు పారిపోగా మరొకడిని పట్టుకున్నారు. శుక్రవారం అటవీ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న సిబ్బందికి తుపాకీ శబ్దం వినిపించింది. సిబ్బంది వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిగిన చోటికి వెళ్లారు. వెంటనే వేటగాళ్లు పారిపోవడానికి ప్రయత్నించారు. కుళ్లి పూంజోలై గ్రామానికి చెందిన పెరియన్న (65) దొరికిపోయాడు. అరుణాచలం అనే వ్యక్తి తప్పించుకున్నాడు. పెరియన్న వద్ద నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వన్య మృగ సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. నిందితుని డెంకణీకోట కోర్టులో హాజరు పరిచారు. అరుణాచలం కోసం గాలిస్తున్నారు.

తాజా సమాచారం