అల్లర్లకు ఆరుగురు బలి

అల్లర్లకు ఆరుగురు బలి

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో సోమవారం చెలరేగిన అల్లర్లు మంగళ వారం తెల్లవారు జాము వరకు కొనసాగింది. ఇప్పటి వరకు ఆరు గురు ప్రాణాలు కోల్పో యారు.మృతుల్లో హెడ్కా నిస్టేబుల్ ఒకరు ఉన్నారు.ఆందోళన కారులు అర్ధరాత్రి వేళ ఓ అగ్నిమాపక యంత్రానికి నిప్పు పెట్టారు.మంటల్ని ఆర్పేందుకు వచ్చిన మరిన్ని అగ్నిమాపక యంత్రాలపై నిరసకారులు రాళ్లు రువ్వారు. దీంతో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయ పడ్డారు. మంగళ వారం ఉదయం మౌజ్పూర్, బ్రహ్మపురి ప్రాంతంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మొత్తం 150 మందికి పైగా గాయాలతో గురు తేజ్ బహదూర్ ఆస్పత్రిలో చేరారు. ఆందోళనకారుల్లో కొంతమంది తుపాకు ఎక్కుపెట్టి ఉన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో సంచరిస్తోంది. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞల్ని విధించారు. భారీ స్థాయిలో పోలీసు బలగాల్ని మోహరించారు. పరిస్థితిపై హోంమంత్రి అమిత్ షా ఎప్పటి కప్పుడు సమీక్షి స్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos