బేగేపల్లిలో అధికారుల బృందం

బేగేపల్లిలో అధికారుల బృందం

హోసూరు : ఇక్కడికి సమీపంలోని బేగేపల్లికి అత్యున్నత అధికారుల బృందం వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించింది. హోసూరు పారిశ్రామిక వాడలోని బేగేపల్లికి ఈ నెల 14వ తేదీ కరోనా బాధితుడు వచ్చి వెళ్లినట్లు అధికారులకు సమాచారం అందింది.వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై విచారణ చేపట్టింది. అధికారుల విచారణలో కరోనా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి గ్రామానికి వచ్చి వెళ్ళినట్లు రుజువు కావడంతో 18వ తేదీ బేగేపల్లిని సీల్ డౌన్ చేసి, ఎవరు ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. గత రెండు రోజులుగా అధికారుల పర్యవేక్షణలో బేగేపల్లి గ్రామ ప్రజలకు నిత్యావసరాలను కూడా అధికారులు సరఫరా చేస్తున్నారు. ఇదిలా ఉండగా అత్యున్నత అధికారుల బృందం ఈరోజు బేగేపల్లికి చేరుకొని క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారుల వద్ద అడిగి తెలుసుకుంది. బేగేపల్లిని సీల్ డౌన్ చేయడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వారి సమస్యలను అత్యున్నత స్థాయి అధికారులు అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు గ్రామాన్ని సీల్ డౌన్ చేస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. అధికారులు అనుమతి లేకుండా గ్రామంలోకి ఎవరు ప్రవేశించరాదని, ఒకవేళ ఎవరైనా ప్రవేశిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos