మూడో వన్డే : చహల్‌ సరికొత్త రికార్డు

మూడో వన్డే : చహల్‌ సరికొత్త రికార్డు

మెల్‌బోర్న్‌: భారత స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ మాయాజాలం చేశాడు. 6 వికెట్లు తీసి ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. చహల్‌తో పాటు భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ చెరో రెండు వికెట్లు తీయడంతో మరో 8 బంతులు మిగిలుండగానే ఆసీస్‌ 230 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియాకు 231 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో 6 వికెట్లు తీసిన చహల్‌ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై 6 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు ఈ ఘనత సాధించిన స్పిన్నర్లు.. అబ్దుల్‌ ఖదీర్‌, టీమిండియా ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి , షేన్‌వార్న్‌, సక్లెయిన్‌ ముస్తాక్‌, జిమ్మీ ఆడమ్స్‌, బ్రాడ్‌ హాగ్‌, ఇమ్రాన్‌ తాహిర్‌.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos