దిశ పేరుపై అభ్యంతరాలు..

దిశ పేరుపై అభ్యంతరాలు..

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న దిశ హత్యాచార ఘటనలో పోలీసులు తీసుకున్న ఓ నిర్ణయంపై కొంతమంది తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.హత్యాచారంలో బలైన యువతి పేరును దిశగా మార్చుతూ పోలీసులు తీసుకున్న నిర్ణయంపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.తమ పిల్లలకు,మనవరాళ్లకు దిశ పేరు పెట్టుకున్నామని ఇప్పుడు పోలీసుల నిర్ణయం ఆ పేరుతో ఉన్న వారికి ఇబ్బంది కలిగిస్తుందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల పేర్లు కూడా దిశ అని..మరి కొందరు పోలీసులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితురాలి పైన పశువుల్లా ప్రవర్తించిన ఆ నలుగురికి కఠిన శిక్ష పడాల్సిందేనని..ఆ కుటుంబానికి అందరూ అండగా నిలవాలని కోరుతనూ పేరు విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఇటువంటి ఘటనల్లో సహజంగా ఉన్న పేర్లు కాకుండా ఢిల్లీ ఘటన తరహాలో పేర్లు వినియోగించాలని విన్నవిస్తున్నారు.  

తాజా సమాచారం

Latest Posts

Featured Videos