జక్కన్నకు తలపోటుగా మారిన లీకులు..

  • In Film
  • February 12, 2020
  • 129 Views
జక్కన్నకు తలపోటుగా మారిన లీకులు..

తారక్‌-చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై జాతీయస్థాయిలో ఒక రేంజులో అంచనాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు ఎటువంటి సమాచారం కనీసం ఫస్ట్‌లుక్‌ కూడా విడుదల చేయకుండా జాగ్రత్త పడుతున్నారు.అయితే లోకేషన్‌ నుంచి వీడియోలు,ఫోటోలు లీక్‌ కాకుండా మాత్రం నిలువరించలేకపోతున్నారు.ఇటీవల పెద్దపులితో తారక్‌ పోరాడే సన్నివేశం లీక్‌ కావడంతో రాజమౌళి చాలా సీరియస్‌ అయినట్లు సమాచారం.అయితే తాజాగా సినిమాలో సైడ్ క్యారెక్టర్లలో ఒక పక్కన నిలుచొని ఉండే డైలాగుల్లేని నటుడు ఒకరు.. RRRకు సంబంధించిన కీలక అంశాల్ని బయటపెట్టేయటంపై జక్కన్న యమా సీరియస్ గా ఉన్నాడట. కీలకమైన సీన్ల గురించి రివీల్ చేసిన ఇతగాడి తీరు ఇప్పుడు RRR టీంలో కలకలం రేపుతోంది. ముందు నుంచి ప్రచారం సాగుతున్నట్లుగా రాంచరణ్.. ఎన్టీఆర్ మధ్య ఫైట్ సీన్ ఉంటుందని చెప్పేయటమే కాదు.. అందులో తారక్ ను చెర్రీ కొడతాడంటూ అతగాడు భారీ సీక్రెట్‌ను రివీల్ చేసేశాడు. అంతేకాదు.. వారిద్దరి మధ్య ఫైటింగ్ సీన్ ను ఏకంగా పది రోజుల పాటు షూట్ చేసిన వైనాన్ని చెప్పుకొచ్చాడు.అంతేకాదు.. ఒక సీన్లో చరణ్ బ్రిటిషర్ డ్రెస్ లో ఉంటే.. తారక్ కుర్తా ఫైజమాలో ఉంటాడని అతగాడు చెబుతున్న వైనం తో జక్కన్న పరివారానికి ఎలా స్పందించాలో అస్సలు అర్థం కావటం లేదట. తన సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని పరమ గుట్టుగా ఉంచే జక్కన్నతీరుకు భిన్నంగా రివీల్ చేయకూడని అంశాల్ని బయటకు చెప్పేసిన సదరు చిన్న నటుడి తీరు పై యమా గుస్సాగా ఉన్నాడట రాజమౌళి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లీకులు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos