నిర్మల వాదన నిరాధారం

నిర్మల వాదన నిరాధారం

గువహటి: యువత కార్లు కొనడానికి బదులు ఓలా, ఉబెర్ల సేవలను వినియోగించుకోవటమే వాహనాల విక్రయాలు పడిపోవడానికి కారణమన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాదనను కార్ల తయారీ సంస్థ మారుతి తిరస్కరించింది. వాహనాల అమ్మకాలు పడి పోవటానికి ఆమె వివరణ బలమైన అంశం కానేకాదని విమర్శించింది. ఒక అభిప్రాయానికి రావడానికి ముందుగా పూర్తి స్థాయి అధ్యయనం అవసరమని పేర్కొంది. ప్రజలు ఇప్పటికీ కార్లను తమ ఆంకాక్ష మేరకు కొంటున్నారని మారుతి సుజుకీ ఇండియా కార్యనిర్వాహక సంచాలకుడు శశాంక్ శ్రీవాత్సవ పేర్కొ న్నారు. ‘ఓలా, ఉబెర్ గత ఆరు, ఏడేళ్లుగా మార్కెట్లో ఉన్నాయి. ఈ సమయంలో ఆటో రంగం బాగా పెరిగింది. గత కొన్ని నెలల్లోనే ఏమైంది? ఇది ఓలా, ఉబెర్ వల్లేనని ఆలోచించకండి’ అని శ్రీవాస్తవ అన్నారు. అమెరికాలో ఉబెర్ వ్యాపారం బాగా సాగుతున్నప్పటికీ కార్ల విక్రయాలూ గత కొన్ని సంవత్సరాల్లో అధికమయ్యాయని గుర్తు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos