నౌహెరా షేక్ ఆస్తుల స్వాధీనం

నౌహెరా షేక్ ఆస్తుల స్వాధీనం

హైదరాబాద్: హీరా గోల్డ్ కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నౌహెరా షేక్ ఆస్తుల్ని శనివారం స్వాధీనం చేసుకుంది. ఇక్కడి టోలీచౌక్ లోని 81 ప్లాట్లను రెవెన్యూ, పోలీసుల సహకారంతో వాటిని ఈడీ జప్తు చేసింది. వాటి విలువ రూ.70 కోట్లని అంచనా. దీంతో ఇప్పటి వరకు నౌహెరా షేక్ కు చెందిన రూ. 300 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. పది కేసుల్లో ఆమె నిందితురాలు. దాదాపు రూ.5600 కోట్ల మేరకు మోసం చేసినట్లు భావిస్తున్నారు. దాదాపు 1.72 లక్షల మంది మదుపర్లు మోస పోయారు. 2018 అక్టోబర్ 16న నౌహీరా షేక్ ను అరెస్టు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos