ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నిలుపుదల

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నిలుపుదల

హైదరాబాద్‌ : తెలంగాణలో అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు జూన్‌ మూడో తేది వరకు నోటిఫికేషన్‌ను జారీ చేయవద్దని హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రాములు నాయక్‌, భూపతి రెడ్డి, యాదవ రెడ్డిల మండలి సభ్యత్వాల రద్దు వ్యవహారంపై గురువారం విచారణ జరిగింది. వీరంతా కాంగ్రెస్‌లో చేరినట్లు ఆధారాలు, ఇతర రికార్డులు సమర్పించడంతో పాటు వాదనలు వినిపించడానికి గడువు ఇవ్వాలని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు కోరారు. ఆయన వాదనతో అంగీకరించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌. చౌహాన్‌ నేతృత్వంలోని వేసవి సెలవుల ధర్మాసనం విచారణను జూన్‌ ఆరో తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ముగ్గురు అనర్హత ఎమ్మెల్సీల తరఫున వాదనలు ముగిశాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos