ఈశాన్య జాతుల్ని తుడిచి పెట్టే క్రిమినల్ దాడి

ఈశాన్య జాతుల్ని తుడిచి పెట్టే క్రిమినల్ దాడి

న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంతాల్లోని జాతులను తుడిచిపెట్టేందుకే భాజపా నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పౌర చట్టాన్ని సవరిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ బుధవారం ట్వీట్లో మండి పడ్డారు.’ఈశా న్యంలోని జాతులను తుడచి పెట్టేందుకు మోదీ-షా ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నమే పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్). ఈశాన్యంపైన, అక్కడి ప్రజల జీవన విధానంపైన, ఐడియా ఆఫ్ ఇండియాపై జరుపుతున్న క్రిమినల్ దాడి ఇది’ అని ఘాటైన విమర్శలు చేశారు. ‘ఈశాన్య రాష్ట్ర ప్రజలకు నేను సంఘీ భావాన్ని తెలుపుతున్నా. వారికి అండగా నిలుస్తాన’ భరోసా ఇచ్చారు. పౌరసత్వ చట్ట సవరణ ముసా యిదా అసహనం, సంకుచిత మనస్తత్వం గల వారితో భారత్ రాజీ పడిందన్న విషయం ధృవ పరచిందని ప్రియాంక్ గాంధీ కూడా దుయ్యబట్టారు. ‘పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రం ద్వారా సమానత్వ హక్కు, మనకిష్టమైన మతాన్ని ఆచరించే హక్కును కూడా పొందాం. మన రాజ్యాంగం, మన పౌరసత్వం, బలమైన-సమైక్య భారత్ను రూపొందించాలన్న కల మన అందరిద’ని ట్వీట్లో పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos