అక్కడ మాంసాహారం నిషేధం

అక్కడ మాంసాహారం నిషేధం

గాంధీ నగర్: అహ్మదాబాద్లోని స్కూళ్లు, కళాశాలలు, మతపరమైన ప్రదేశాలకు నూరు మీటర్ల పరిధిలో మాంసాహారం విక్రయాన్ని ప్రభుత్వం నిషేధించింది. దీంతో చిరు వ్యాపా రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. జీవనాధారాన్ని కోల్పోయి రోడ్డున పడతామని ఆందోళన చెందారు. హోటళ్లు, రెస్టారెంట్లలో మాంసాహారాన్ని అనుమతించి రోడ్డు పక్కన స్టాళ్లలో మాత్రం అమ్మకూడదనడం ఏంటని ప్రశ్నించారు. మాంసాహారం వాసన రోడ్డుపైన స్టాళ్లలో మాత్రమే వస్తుందా? హోటళ్లలో రాదా? అని ఆగ్రహించారు. పరి శుభ్రత, పౌర సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. ‘ ప్రజల భిన్నమైన ఆహారపు అలవాట్ల కారణంగా ప్రభుత్వానికి ఎలాంటి సమస్యా లేదు. కొందరు శాకాహారం తింటారు. మరికొందరు మాంసాహారం తీసుకుంటారు. దీనివల్ల బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు. అ యి తే, రోడ్డు పక్కన బళ్లపై విక్రయించే ఆహార పదార్థాలు అపరిశుభ్రంగా ఉంటాయి’’ అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos