క్రిష్ణగిరి జిల్లాలో 12,342 నామినేషన్లు

క్రిష్ణగిరి జిల్లాలో 12,342 నామినేషన్లు

హొసూరు : తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27, 30 తేదీలలో రెండు విడతల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు క్రిష్ణగిరి జిల్లాలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం నామినేషన్ల ఘట్టం ముగిసిన సంగతి తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా పంచాయతీ అధ్యక్ష, యూనియన్, జిల్లా కౌన్సిలర్, వార్డు సభ్యుల పదవులకు 12,342 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం నామినేషన్ల పరిశీలనను చేపట్టారు. తరువాత బరిలో ఉండే అభ్యర్థుల జాబితా వెలువడుతుంది. హొసూరుతో పాటు సూలగిరి, తళి, కెలమంగలం యూనియన్లలో కౌన్సిలర్ పదవులకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. సూలగిరి యూనియన్ కౌన్సిలర్ పదవికి సానామావుకు చెందిన సంపంగి ఏడీఎంకే తరఫున బరిలోకి దిగనున్నారు. హొసూరు యూనియన్‌లోని సేవగానపల్లి పంచాయతీలో  శ్రీమతి సంధ్య గోపి ఏడీఎంకే తరపున కౌన్సిలర్‌ పదవికి పోటీ చేయనుండగా, కెలమంగలం యూనియన్ కౌన్సిలర్ పదవికి అగ్గొండపల్లికి చెందిన శాంతకుమార్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటి చేయనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos