ఖట్టర్‌ పై అవిశ్వాస ఖడ్గం

ఖట్టర్‌ పై అవిశ్వాస ఖడ్గం

ఛండీగఢ్: కేంద్ర నూతన సాగు చట్టాలపై రైతు ఆందోళనల సెగ హర్యానాలోని బీజేపీ-జేజేపీ ప్రభుత్వానికి తాకింది. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా మంగళవారం ఇక్కడ తెలిపారు. హర్యానా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఇద్దరు ఇండిపెండెంట్లు ఆ మద్దతును ఉపసంహరించుకున్నారని తెలిపారు. ‘ప్రజలు, ఎమ్మెల్యేల విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయింది. దీనిపై మేము అవిశ్వాస తీర్మానం తెస్తాం. ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఇది అత్యంత అవినీతి ప్రభుత్వమని కొందరు ప్రభుత్వ భాగస్వామ్య పార్టీల నేతలే చెబు తున్నారు’ అని విలేఖరులతో హుడా చెప్పారు. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ల వివరాలను అవిశ్వాస తీర్మానం తెచ్చే సమయంలో వెల్లడి స్తామని తెలిపారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక సమావేశాన్ని గవర్నర్ ఏర్పాటు చేయాలని కోరారు. హర్యానా బడ్జెట్ సమావేశాలు మార్చి 5న ప్రారంభం కావాల్సి ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos