పెట్రోలుకు నో క్యాష్‌బ్యాక్‌

  • In Money
  • September 25, 2019
  • 144 Views
పెట్రోలుకు నో క్యాష్‌బ్యాక్‌

ఢిల్లీ : క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదు. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి రెండున్నరేళ్ల క్రితం పెట్రోల్‌పై చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించాయి. వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని వెల్లడించాయి. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. 2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో ఇస్తున్నాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos