తెలంగాణ : టెన్త్‌లో అందరూ పాస్

హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలను రద్దు చేశారు. పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్ధులు పాసయ్యారు. ఇంటర్నల్, అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్ధులను ప్రమోట్ చేశారు. దీంతో ఈ విషయంపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళన తొలగినట్లైంది. మొత్తం 5, 34, 903 మంది విద్యార్ధులను ప్రమోట్ చేయనున్నారు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ నిర్ణయిస్తారు. అటు డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. కరోనా తీవ్రత నేపథ్యంలో విద్యార్ధులకు కరోనా సోకితే బాధ్యులెవరని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించడంతో సర్కారు డిఫెన్స్లో పడింది. కరోనా నేపథ్యంలో రిస్క్ తీసుకునే కన్నా విద్యార్ధులను ప్రమోట్ చేయడం ఉత్తమమని నిర్ణయించుకుని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos