రూ. 17కోట్లు పలికిన నిజాం కంఠ హారం

రూ. 17కోట్లు పలికిన నిజాం కంఠ హారం

న్యూయార్క్: హైదరాబాద్‌ను పాలించిన నిజాం నవాబులు ధరించిన ఆభరణాలకు వేలంలో ఊహించిన దాని కంటే ఎక్కువ ధర లభించినట్లు అమెరికాకు చెందిన క్రిస్టీ సంస్థ గురువారం ఇక్కడ వెల్లడించింది. భారతదేశాన్ని పాలించిన పలువురు మహారాజులు, మొఘల్ పాలకుల లు వినియోగించిన నగలను ఆ సంస్థ వేలం వేసింది.నిజాం నవాబుల రివిరీ డైమండ్ కంఠహారం వేలంలో 24,15,000 (రూ. 17కోట్లు )డాలర్లు పలికింది. 33 వజ్రాలు పొదిగిన ఈ నగ 15,00,000 డాలర్లు(రూ. 10.5కోట్లు) పలుకుతుందని అంచనా వేశారు. ఇక ఆర్కాట్‌ నవాబులు ధరించిన చెందిన 17 క్యారెట్ల గోల్కొండ వజ్రం ‘ఆర్కాట్‌ 2’ రికార్డు స్థాయిలో 33,75,000 డాలర్లు(రూ. 23.5కోట్లు), నిజాం కాలం నాటి ఖడ్గం 19,35,000 డాలర్లు(రూ. 13కోట్లు), జైపూర్‌ రాజమాత ధరించిన వజ్రపుటుంగరం రూ. 4.45కోట్లు, సహజ ముత్యాలతో తయారుచేసిన ఐదువరుస నక్లెస్‌ రూ. 11.8కోట్లు పలికాయి. మహారాజాస్‌ అండ్ మొఘల్‌ మాగ్నిఫికెన్స్‌’ పేరుతో దాదాపు 400 నగలను క్రిస్టీ సంస్థ వేలానికి పెట్టింది. వజ్రాల ఆభరణాలు, ముత్యాల నక్లెస్‌లు, కత్తులు, ఉంగరాలు తదితర వస్తువులను వేలం వేసింది. వేలంలో ఈ వస్తువులకు మొత్తంగా 10,92,71,875 డాలర్లు వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. భారత సంస్కృతికి చెందిన ఆభరణాలు, వస్తువులు ఇంత ఎక్కువ ధర పలకడం ఇదే తొలిసారి అని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos