కేంద్రానికి షాకిచ్చిన నితీష్‌ కుమార్‌

కేంద్రానికి షాకిచ్చిన నితీష్‌ కుమార్‌

పట్నా :నూతన పౌరసత్వ చట్టంపై అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నందున దాన్ని సమీక్షించాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సమగ్ర చర్చకు త్వరలో శాసనసభ సమావేశాన్ని నిర్వహించ నున్నట్లు ఇక్కడ విలేఖరులకు తెలిపారు. సీఏఏపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా డిమాండు చేసారు. ఎన్ఆర్సీని బిహార్లో అమలు చేసే ప్రసక్తేలేదని ఇప్పటికే ప్రకటిం చా రు.నితీష్ తాజా ప్రకటనతో భాజపా నేతలు షాక్కి గురయ్యారు. పార్లమెంట్లో సీఏఏ ముసాయిదాకు జేడీయూ మద్దతిచ్చిన సం గతి తెలిసిందే. శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నితీష్ అన్ని అంశాల్లో ఆచితూచి అడుగులు వేస్తు న్నా రు. ప్రజాగ్రహానికి గురైన చట్టాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తోంది. ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితా ల ను దృష్టిలో ఉంచుకుని జాతీయ అంశాలను పక్కనపెట్టి, కేవలం స్థానిక అంశాలపైనే నితీష్ దృష్టి సారిస్తున్నారు. జేడీయూ ఉ పా ధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వివాదాస్పద చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన సూ చ నల మేరకే నితీష్ నిర్ణయాలు తీసుకుంటున్నారని బిహార్ రాజకీయ వర్గాల సమాచారం. ఎన్సీఆర్సీ, సీఏఏకు వ్యతిరే కంగా ప్ర తి పక్షాల నేతృత్వం లో బిహార్, యూపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరగటం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos