ఖజానాకు కాసుల కరువు

ఖజానాకు కాసుల కరువు

న్యూఢిల్లీ : ‘భారత ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చూసి నేను ఆందోళన చెందటం లేదు. ఆత్మ సంతృప్తి కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎదురు గాలులు వీస్తున్నా మునిగి పోకుండా నీటి పైనే భారత తన తలను ఉంచగలుగుతోంద’ని కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. తను ఎంత నర్మగర్భంగా మాట్లాడిన దేశ ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదనే విషయం ఆమె మాటల్లోనే అర్థం అవుతోంది. దేశంలోని ఎనిమిది కోట్ల పరిశ్రమల వృద్ధి రేటు 0.2 శాతం ఒక్క జూన్ నెలలోనే పడిపోయింది. అది 50 నెలల కనిష్ట స్థాయికి దిగజారటం చాలా ఆందోళ నకరం. మోటారు వాహనాల అమ్మకాలు గత 9 నెలలుగా వరుసగా పడిపోతున్నాయి. మారుతి కార్ల అమ్మకాలు 30 శాతానికి మించి పడిపోయాయి. గత రెండు దశాబ్ధాల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా పలు సంస్థలు లే ఆఫ్ లు ప్రకటించే పరిస్థితి దాపు రించింది. సర కుల అమ్మకాల్లో హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, గోద్రెజ్ లాంటి కంపెనీలు 2019, తొలి త్రైమాసికంలో కేవలం ఒక అంకె వృద్ధిని మాత్రమే సాధిం చాయి. 16 కీలక ఆర్థిక సూచికల ప్రకారం ఈ పరిస్థితి సమీప భవిష్యత్తులో మెరుగయ్యే అవకాశాల్లేవు. పొదుపు ఖాతాల సొమ్ము గత ఐదేళ్ల కాలంలో భారీగా పడి పోయింది. ఈ సొమ్ము 2013–14 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 22 శాతం ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీ పీలో 17 శాతానికి పడింది. పన్ను వసూళ్ల వృద్ధి 18.3 శాతం ఉంటుందనే బడ్జెట్ ప్రతిపాదనల అంచనా తల కిందులైంది. మొదటి త్రై మాసికంలో కేవలం 1.4 శాతం వృద్ధి సాధ్యమైంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే మిగతా కాలంలో 22.3 శాతం వృద్ధి రేటును సాధించాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos