బిల్లా-రంగా తరువాత నిర్భయ దోషులే..

బిల్లా-రంగా తరువాత నిర్భయ దోషులే..

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ కేసులో దోషులు నలుగురికీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ క్షమాభిక్షను నిరాకరించిన పక్షంలో వెంటనే వారిని ఉరి తీయడానికి తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. నెల 7 వీరిపై డెత్ వారెంట్ తీర్పు వెలువడనున్నట్టు తెలుస్తుండగా, నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.అయితే, ప్రస్తుతం తీహార్ జైలులో ఒకే ఉరికంబం ఉండడంతో, మరో మూడింటిని నిర్మిస్తున్నారు. పీడబ్ల్యూడీ విభాగం సిబ్బంది పనుల్లో నిమగ్నమైంది. నూతనంగా మూడు ఉరికంబాలను, మూడు సొరంగాల నిర్మాణాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్టు అధికారి తెలిపారు. కాగా, తీహార్ జైల్లో ఉరి తీసే ప్రదేశంలో మొత్తం 16 డెత్ సెల్స్ ఉండగా, రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించగానే, నలుగురినీ నాలుగు వేర్వేరు గదులకు జైలు అధికారులు తరలించనున్నారు.కాగా ఉరిశిక్షను అమలు చేసిన నలుగురి మృతదేహాలను తరలించడానికి తీహార్ కేంద్ర కారాగారంలో అధికారులు ప్రత్యేకంగా టన్నెల్ ను నిర్మిస్తున్నారు. ఉరి తీసిన ప్రదేశం నుంచి టన్నెల్ ద్వారానే నలుగురి మృతదేహాలను బయటికి తీసుకెళ్లనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జైలు ప్రధాన ద్వారం గుండా మృతదేహాలను తరలించడం ఆనవాయితీ కాదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. టన్నెల్ తవ్వడానికి జేసీబీని రప్పించారు అధికారులు. టన్నెల్ తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. దేశానికిి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయబోతుండటం ఇదే తొలిసారి. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఒకరికి మించి దోషులను ఒకేసారి ఉరి తీసిన సందర్భాలు అరుదు. ఒక్కసారి మాత్రమే అలాంటి సందర్భం చోటు చేసుకుంది. బిల్లారంగా అనే ఇద్దరు కరడుగట్టిన నేరస్తులను తీహార్ జైలులోనే ఒకేసారి ఉరి తీశారు. తరువాత.. ఒకరికి మించి ఉరి తీసిన సందర్భాలు చోటు చేసుకోలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos