ఉరి మరోసారి వాయిదా!

ఉరి మరోసారి వాయిదా!

నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.నలుగురు నిందితులను వేర్వేరుగా ఉరి తీయడానికి అనుమతించాలంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన  కోర్టు విచారణను వచ్చేనెల 5వ తేదీకి వాయిదా వేసింది.నిందితులైన పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ రాథోడ్, ముఖేష్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మలకు ఉరిశిక్షను అమలు చేయడానికి ఢిల్లీ న్యాయస్థానం ఇదివరకే డెత్ వారెంట్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే.దీని ప్రకారం.. వచ్చేనెల 3వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకు ఈ నలుగురు దోషులకు తీహార్ కేంద్ర కారాగారంలో ఉరి తీయాల్సి ఉంది. తాజాగా- సుప్రీంకోర్టు వారి ఉరిశిక్షను అమలు చేయడానికి ఉద్దేశించిన పిటీషన్‌ను మార్చి 5కు వాయిదా వేసింది. ఫలితంగా- ఉరిశిక్షను అమలు చేయకపోవచ్చని తెలుస్తోంది.సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న పరిణామాలను బట్టి చూస్తూ.. ఈ సారి కూడా సాధ్యమయ్యేలా కనిపించట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos