జేఎన్‌యూ విద్యార్థులకు ఉదయ నిధి సంఘీ భావం

జేఎన్‌యూ విద్యార్థులకు ఉదయ నిధి సంఘీ భావం

న్యూఢిల్లీ: ఇక్కడి ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు, నటుడు ఎంకే ఉదయనిధి సంఘీ భావాన్ని ప్రకటించారు. విద్యార్థులతో కలిసి సోమవారం నిరసన దీక్షలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిని పోలీ సులు ఇప్పటి వరకూ అరెస్టు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. సోమవారం ఉదయం చెన్నై నుంచి ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా జేఎన్యూ ఆవరణకు వెళ్లి విద్యార్థులను కలిశారు. విద్యార్థులపై గుర్తు తెలియని దుండ గుల దాడి, తర్వాతి పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులే ఈ దాడికి పా ల్ప డి ఉండొచ్చనే అనుమానాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని మరింత బలాన్ని ఇస్తోందని వ్యాఖ్యానించారు. నేరగాళ్లెవవరో సీసీటీవీ ఫుటే జీల్లో తేలినప్పటికీ అరెస్టు చేయకపోవడం పోలీసుల ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos