ముద్దు పెడితే తప్పేంటి?

  • In Film
  • March 28, 2019
  • 273 Views
ముద్దు పెడితే తప్పేంటి?

హోళి వేడుకల్లో మీడియా ముందు బాలీవుడ్‌ తారలు నియాశర్మ,రెహాన పండిట్‌ల లిప్‌లాక్‌ వ్యవహారం బాలీవుడ్‌లో ఇంకా ప్రకంపనలు రేపుతూనే ఉంది.లిప్‌లాక్‌ విషయంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతుంటే ఇద్దరు హీరోయిన్లు మాత్రం తాము చేసిన పనిని సమర్థించుకుంటుండడం విశేషం.ముద్దు పెట్టుకున్నంత మాత్రానా ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఉందా?అమ్మాయి బుగ్గపై ముద్దు పెట్టుకున్నపుడు లేని తప్పు పెదవులపై పెడితే ఎలా తప్పవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు.మేమిద్దరం మంచి స్నేహితుల,ఇతరులకు విభిన్నంగా ఒకటే మనస్తత్వం కలిగిన వ్యక్తులం.

నా సోదరి తర్వాత నేను సోదరిగా భావించేది నియాను మాత్రమే.ఆ ప్రేమతోనే తనను ముద్దు పెట్టుకున్నా.ఈ మాత్రం దానికి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ రెహాన అన్నారు.రెహాన ముద్దుపై నియా స్పందిస్తూ..చిన్న ముద్దును పెద్ద వివాదంగా చిత్రీకరించి విమర్శలు చేస్తున్నారంటూ వాపోయింది.ముద్దు వెనుక ఎటువంటి ఉద్దేశాలు లేవని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలంటూ కోరింది.రెహాన మంచి స్నేహితురాలని అందుకే హోళి రోజున ముద్దు పెట్టిందని సమర్థించుకుంది.గతంలో జమాయ్‌ రాజా అనే షోలో కూడా ఇద్దరు భామలు ఇలానే పెదవి ముద్దులతో షాకిచ్చారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos