పుల్వామా దాడి వెనుక కాశ్మీరీ మహిళ..

పుల్వామా దాడి వెనుక కాశ్మీరీ మహిళ..

గత ఏడాది కాశ్మీర్లోని పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకు సైనికులు జరిపిన దాడిలో జైషే ఉగ్రవాది మహ్మద్ ఉమర్ ఫరూక్ హతమయ్యాడు. పుల్వామా ఘటన పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ ఐఏ) దర్యాప్తు సాగిస్తోంది. తాజాగా ఎన్ఐఏ 13 500 పేజీలతో ప్రభుత్వానికి రిపోర్టు దాఖలు చేసింది. ఇందులో పుల్వామా ఘటనకు సంబంధించి ఎన్నో సంచలన విషయాలు దాగి ఉన్నాయి. ప్రస్తుతం విస్తుపోయే ఓ విషయం బయటకు రాగా అది అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.జవాన్లపై దాడి చేయడానికి వచ్చిన ఉగ్రవాదులకు కాశ్మీర్ లోనే అండదండలు లభించాయి. వారికి అన్ని సౌకర్యాలతో బస లభించడంతో అదును చూసి జవాన్లపై ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిసింది. కాశ్మీరుకు చెందిన 23 ఏళ్ల ఇన్ షా జాన్ అనే మహిళ జైషే ఉగ్రవాదులకు సహకరించినట్లు ఎన్ ఐఏ తన దర్యాప్తులో వెల్లడించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇన్ షా జాన్ జైషే ఉగ్రవాదులకు సహకరించడంతో పాటు వారితో ఫోన్లో టచ్లో ఉండేది. పాకిస్తాన్ బాంబు మేకర్ మహ్మద్ ఉమర్ ఫరూక్ కు ఈ మహిళ ఎంతో సహాయ పడింది. ఇన్ షా జాన్ జైషే ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఆ యువతి తండ్రి తారిఖ్ వీర్ కూడా వారికి సహకరించడం మొదలుపెట్టాడు.తండ్రి కూతురు ఉగ్రవాదులను ఇంట్లోనే పెట్టుకొని బస భోజనం ఇతర సౌకర్యాలు కల్పించారు. ఆ తర్వాత ఉగ్రవాదులు పుల్వామాలో జవాన్లపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతరం గత మార్చిలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఉమర్ ఫరూక్ మృతి చెందాడు. ఇన్ షా జాన్ ఉగ్రవాదం వైపు మళ్ల డానికి గల కారణాలు ఏంటో అధికారులకు అంతుబట్టడం లేదు. ఎన్ ఐఏ దాఖలు చేసిన నివేదికలో ఇన్ షా జాన్ ను అరెస్టు చేసింది లేనిదీ వివరాలు వెల్లడించలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos