త్రివర్ణ పతాకాన్ని వ్యతిరేకించిన పరివార్‌

త్రివర్ణ పతాకాన్ని వ్యతిరేకించిన పరివార్‌

జైపూర్: జాతీయ గీతానికి, త్రివర్ణ పతాకానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఎప్పుడూ వ్యతిరేకమేనని రాజస్థాన్ హోం మంత్రి శాంతి ధరివాల్ వ్యాఖ్యానించారు. గతంలో ఆరెస్సెస్ జాతీయ పతాకాన్ని అవమానించిందని బుధవారం ఇక్కడ జరిగిన ఆరోపించారు. ‘1930 జనవరి 26న దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలని మహాత్మా గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అప్పుడు ఆరెస్సెస్ కాషాయ జెండాను ఆవిష్క రించింద’ని పేర్కొన్నారు. జాతీయ గీతం దేశభక్తి భావనను కలిగించడం లేదంటూ వందేమాతరం గేయాన్ని ఆలపించాలని పరివార్ పట్టు బట్టిం  దన్నారు. ‘వందేమాతరం మాదిరిగా జనగణమన దేశభక్తి భావనను కలిగించడం లేదని ఆరెస్సెస్ 1925 నుంచి చెబుతోంది. వాళ్లు జాతీయ గీతాన్ని వ్యతిరేకించడమే కాకుండా జాతీయ జెండా కాషాయ రంగులోనే ఉండాలని బహిరంగానే చెప్పార’ని ధరివాల్ పేర్కొన్నారు. ఆరెస్సెస్ సిద్ధాం తాలు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని తీవ్రంగా కలవరపరచాయని చెప్పారు. ‘మత ఘర్షణల వల్ల దేశంలో ప్రజలు చనిపోయారంటే.. దానికి ఆరె స్సెస్ విధానాలే కారణం అని ఆయన చెప్పేవార’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos