న్యూస్క్లిక్ పై కేంద్రం దాడి

న్యూస్క్లిక్ పై కేంద్రం దాడి

న్యూఢిల్లీ : వాస్తవాలను ధైర్యంగా ప్రజలకు అందిస్తోన్న స్వతంత్ర మాధ్యమం -న్యూస్క్లిక్ పై కూడా కేంద్ర ప్రభుత్వం దాడులకు దిగింది. ఆ సంస్థ కార్యాలయాలతో పాటు యాజమాన్యం, అధికారులు, జర్నలిస్టుల నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మంగళవారం ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు చేసింది. న్యూస్ క్లిక్ యజమాని ప్రబీర్ పుర్కాయస్థ, ఎడిటర్ ప్రంజాల్తో పాటు పలువురు అధికారులు, జర్నలిస్టుల నివాసాలలో కూడా సోదాలు జరిపినట్లు వైర్ మీడియా ధ్రువీకరించింది. ఇక్కడి సైదులాజాబ్లోని సంస్థ కార్యాలయంపై కూడా దాడి జరిగిందని తెలిపింది. అక్రమ నగదు లావాదేవీల కేసుకు సంబంధించి సోదాలు చేస్తున్నారని తెలిపింది. అధికారుల నివాసాలలో ఉదయం నుండి సోదాలు జరుగుతున్నాయని ప్రంజాల్ అన్నారు. ఇడి అధికారులకు సహకరిస్తున్నామని.. సహకరిస్తామని, నోటీసులు కూడా ఇచ్చారని ఆయన చెప్పారు. ఇడి అధికారులు సోదాలు జరుపుతున్నారని న్యూస్ క్లిక్కు చెందిన రెండు యూట్యూబ్ కార్యక్రమాల వ్యాఖ్యాత అభిసర్ శర్మ ట్విటర్లో స్పష్టం చేశారు. కేంద్రానికి తగినట్లు వార్తలు ప్రచారం చేయనందున జర్నలిస్టులను వేధించేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నమని కొందరు జర్నలిస్టులు మండి పడ్డారు. కాగా, ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos