సిరిసిల్ల చీరలకు న్యూజీలాండ్ ఎంపీ ప్రచారకర్త..

సిరిసిల్ల చీరలకు న్యూజీలాండ్ ఎంపీ ప్రచారకర్త..

తెలంగాణ రాష్ట్ర హస్త కళలు,చేనేత ఉత్పత్తులకు విదేశాల్లో ప్రచారం కల్పించడానికి న్యూజీలాండ్ పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక రాధాకృష్ణ శ్రీకారం చుట్టారు.ముఖ్యంగా సిరిసిల్ల చేనేత కళాకారుల చేనేత వస్త్రాలకు విదేశాల్లో మార్కెట్ కల్పించడానికి ప్రియాంక ప్రయత్నిస్తున్నారు.ప్రవాస భారతీయులను దీనిలో భాగస్వాములుగా చేసి తెలంగాణ ఉత్పత్తులకు ప్రచారం కల్పించి, తద్వారా మన రాష్ట్ర నేతన్నలకు,హస్త కళాకారులకు ఉపాధి కల్పనకు కృషిచేస్తున్నారు. తాజాగా న్యూజీలాండ్‌లోని అక్లాండ్‌లో తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూ జిలాండ్ ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన ప్రియాంక సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన చీరను కొనుగోలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఉభయ తారకంగా చేపట్టిన బతుకమ్మా చీర కానుక పథకాన్ని కొనియాడారు.న్యూ జీలాండ్‌లో బ్రాండ్ తెలంగాణ చేస్తున్న చేపట్టిన ఉద్దేశ్యం చాల గొప్పగా ఉందన్నారు.బ్రాండ్ తెలంగాణ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ప్రచారకర్తగా వ్యవహరించడానికి ప్రియాంక అంగీకరించడం చాలా సంతోషంగా ఉందని బ్రాండ్ తెలంగాణా వ్యస్థాపకురాలు సునీతవిజయ్ తెలియజేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos