జూన్ 12న సుశాంత్ ఇంట్లోనే రియా..

జూన్ 12న సుశాంత్ ఇంట్లోనే రియా..

బాలీవుడ్ హీరో సుశాంత్ మృతితో తనకు సంబంధం లేదని రియా చక్రవర్తి ఎంతగా ప్రయత్నిస్తున్నా ప్రతిరోజు వెలుగు చూస్తున్న కొత్త విషయాలు రియాపై అనుమానాలు మరింత బలపడేలా చేస్తున్నాయి.జూన్ 8 తరువాత తాను సుశాంత్ ఇంటికే వెళ్లలేదని రియా చక్రవర్తి తొలి నుంచి వాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సుశాంత్ చనిపోవడానికి రెండు రోజుల ముందు… అంటే, జూన్ 12న రియా ఆయన ఇంట్లోనే ఉందనడానికి ఇదే సాక్ష్యమంటూ అభిమానులు,నెటిజన్లు ఓ ఫోటోను వదిలారు.ఈ చిత్రంలో రియా ఓ మ్యాంగో కేక్ ను పట్టుకుని కనిపిస్తోంది. ఇది జూన్ 12న తీసినట్టు స్పష్టమవుతోంది. ఇక ఈ ఫొటోలో వెనుక కనిపిస్తున్న కిటికీ, సుశాంత్ ఇంట్లోనిదేనని గుర్తించిన ఫ్యాన్స్, సామాజిక మాధ్యమాల్లో రియాను టార్గెట్ చేసుకుని మరోసారి మండిపడుతున్నారు.ఈ ఫొటోను బహిర్గతం చేసిన సుశాంత్ సోదరి, జూన్ 12న రియా, సుశాంత్ ఒకే చోట ఉన్నారని వ్యాఖ్యానించింది. గతంలో సుశాంత్, రియాలు తీసుకున్న ఫొటోల్లోనూ, ఈ చిత్రంలోనూ వెనుకవైపు ఒకే రకమైన కిటికీలు, గదుల రంగులు కనిపిస్తున్నాయి. అయితే, ఈ ఫొటోను అంతకుముందే తీసుకుని, ఆ రోజున పోస్ట్ చేసిందా? లేక జూన్ 12న రియా అక్కడే ఉందా? అన్న విషయమై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos