ఎస్‌బీఐ ఖాతాదారులకు మరో షాక్

  • In Money
  • September 27, 2019
  • 114 Views
ఎస్‌బీఐ ఖాతాదారులకు మరో షాక్

ముంబై : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. అక్టోబర్ ఒకటి నుంచి పలుబ్యాంక్ చార్జీలు, లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నగదు ఉపసంహరణ, చెక్ బుక్ వినియోగం, డబ్బు కట్టడం, ఏటీఎం లావాదేవీలు సహా పలు అంశాలకు సంబంధించి ఈ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఖాతాదారులు నెలకు మూడు సార్లు మాత్రమే బ్యాంకులో ఉచితంగా డబ్బు డిపాజిట్ చేయవచ్చు. తదనంతరం రూ.50 చెల్లించాల్సి రావొచ్చు. దీనికి జీఎస్టీ అదనం. ఐదో డిపాజిట్ తర్వాత నుంచి రూ.56 వసూలు చేస్తుంది. చెక్ బౌన్స్ అయితే అదనంగా రూ.150 చెల్లించాల్సి రావొచ్చు. ఏటీఎం లావాదేవీల సంఖ్య మెట్రో నగరాల్లో పదికి పెరగనున్నాయి. ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు ఇది వర్తిస్తుంది. ఇతర ప్రాంతాల్లో ఎలాంటి చార్జీలు లేకుండా ఎస్‌బీఐ ఏటీఎంలో పన్నెండు వరకు లావాదేవాలను నిర్వహించుకోవచ్చు. అదే ఇతర బ్యాంకుల ఏటీఎంలైతే ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం. బ్యాంకుల్లో జీతం ఖాతా కలిగిన వారు ఎస్‌బీఐ లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలో ఉచితంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఆర్టీజీఎస్, నెఫ్ట్ సేవలు ఉచితం. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేస్తేనే ఈ సదుపాయం ఉంటుంది. బ్యాంకుకు వెళ్లి ఈ సేవలు పొందాలంటే చార్జీలు చెల్లించాల్సి రావొచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos