కరోనా దెబ్బకు సంస్కృతి,సాంప్రదాయాలు గుర్తుకొస్తున్నాయి..

కరోనా దెబ్బకు సంస్కృతి,సాంప్రదాయాలు గుర్తుకొస్తున్నాయి..

సాంప్రదాయాల్ని పూర్తిగా మర్చిపోక పోయినా పాశ్చాత్య పెను పోకడల్ని నషాలానికి ఎక్కించుకున్న భారతావని ఇప్పటికే అభాసుపాలవుతోంది. పాశ్చాత్యుల పెనుపోకడలు డ్రగ్ కల్చర్.. దౌర్జన్య దుర్మార్గపు కాండ భారతదేశాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా మహమ్మారీని మించిన ప్రమాదం అది. అయితే సనాతన భారతీయ ఆచారాల్ని పద్ధతుల్ని ఆచరిస్తే ఇవేవీ ఉండేవి కాదని సాంప్రదాయ వాదులు చెబుతుంటారు. పెరుగుతున్న అతిని కంట్రోల్ చేయలేని దుస్థితికి చింతించే వారు ఉన్నారు. దాదాపు రెండు దశాబ్ధాల క్రితం భారత దేశానికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూస్తున్నదే. అప్పట్లో దూరదర్శన్ లో మహాభారతం.. రామాయణం వంటి సీరియళ్లను జనం రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారు. మన పురాణేతిహాసాల సారాన్ని గొప్పతనాన్ని తెలుసుకుని తరించేవారు. కొంతవరకూ విశృంఖలత అదుపులో ఉండేది. కానీ ఇప్పుడు అది కట్టలు తెంచుకుని శివతాండవమాడుతోంది. అయితే సరిగ్గా ఇలాంటి సమయంలోనే కరోనా వైరస్ మహమ్మారీ ప్రపంచానికి పాఠాలు నేర్పిస్తోంది. మనదైన సాంప్రదాయం.. సంస్కృతి గొప్పతనాన్ని తిరిగి గుర్తు చేస్తోంది. దైవంభక్తి.. వేది పండితుల మంత్రోచ్చారణ ఇలా ప్రతిదీ ఇప్పుడు గొప్పగా కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా తిరుమలలో తి.తి.దే నిర్వహిస్తున్న మహా శాంతి యాగం.. స్వరూపానంద స్వామీజీ సారథ్యంలో విశాఖలో నిర్వహిస్తున్న యాగానికి టీవీల్లో విపరీతమైన ఆదరణ కనిపిస్తోంది. కరోనా మహమ్మారీని నివారించేందుకు 11 రోజులుగా విశాఖశారదాపీఠం సారథ్యంలో అమృత పాశుపత యాగం చేస్తున్నారు.ఇక ఇదొక్కటేనా? ప్రస్తుతం దూరదర్శన్ లో మహాభారతంరామాయణం వంటి టీవీ సీరియళ్లను రీటెలీకాస్ట్ చేస్తుంటే జనం వీటిపై పడ్డారని తెలుస్తోంది. ఇంతకుముందు ఇలాంటివి వస్తేఇళ్లలో ముసలాళ్లు చూసేవారు.. యూత్ లేడీస్ ఏడుపు గొట్టు సెంటిమెంటు కుట్రల  సీరియళ్లు చూసేవారు. ఇప్పుడు సీన్ మారిందట. కరోనా దెబ్బకు ఝడిసి ఇంటిల్లిపాదీ డీడీ చానెల్ పెట్టుకుని రామాయణం మహాభారతం చూస్తున్నారట. ప్రస్తుత సన్నివేశం దృష్ట్యా దూరదర్శన్ వర్గాలు తెలివిగా వీటిని రీటెలీకాస్ట్ చేస్తుండడంతో టీఆర్పీలు కుమ్ముకొచ్చేస్తున్నాయట. ఇదంతా చూస్తుంటే.. ఏదైనా భూతం తరుముకొస్తేనే భయం ముంచుకొస్తుందని అర్థమవుతోంది. కరోనా అంటుకుంటేనే మన భారతీయత పురాణాలు కనిపించాయా? పాశ్చాత్య ధోరణితో సాంప్రదాయాల్ని పాతరేసిన ఫలితం అనుభవిస్తున్నారా? తిరిగి పాత రోజులు రాబోతున్నాయా? అంటూ పంచ్ లు పడిపోతున్నాయి. మరోవైపు కరోనా గురించి ఇంతకుముందే హాలీవుడ్ సినిమాల్లో చూపించారు. ప్రస్తుతం వాటిని యూట్యూబ్ సహా డిజిటల్ మాధ్యమాల్లో జనం తెగ వీక్షిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos