నీతి ఆయోగ్‌ సమావేశం వృధా

నీతి ఆయోగ్‌ సమావేశం వృధా

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 15న జరిగనున్న నీతి ఆయోగ్‌ సమావేశానికి తాను హాజరుకాబోనని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు మోదీకి లేఖ రాసారు. ‘నిజం చెప్పాలంటే నీతి ఆయోగ్‌కు ఎలాంటి ఆర్థిక అధికారాలు గానీ, రాష్ట్రాల ప్రణాళికలకు మద్దతిచ్చే అధికారం గానీ లేదు. అలాంటప్పుడు నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరుకావడం అనేది వ్యర్థమైన పన’ని ఆ లేఖలో వ్యాఖ్యా నించారు. ‘గత నాలుగున్నరేళ్లుగా నీతి ఆయోగ్‌ పని తీరును చూసిన తర్వాత నేను చెప్పాలనుకున్నది ఒకటే. కొన్ని మార్పు లు చేర్పులతో అంతర్రాష్ట్ర మండలిపై దృష్టి పెట్టడమే మంచిది. ఇది సమాఖ్య విధానాల్ని మరింత బలో పేతం చేస్తుంద’ని పేర్కొ న్నారు. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేయటాన్ని మమతా బెనర్జీ పలుమార్లు తప్పు బట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos