అక్టోబర్ 5 వరకూ చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కీం కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చేనెల ఐదో తేదీ వరకూ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. అంటే మరో 11 రోజుల పాటు చంద్రబాబు నాయుడుకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు. చంద్రబాబును జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని అధికారులను జడ్జి ఆదేశించారు. దీంతో మరో 11 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉండను న్నారు .ఆదివారంతో చంద్రబాబు జ్యుడిషియల్ డిమాండ్ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబును హాజరు పరిచారు. చంద్రబాబు తరపు న్యాయవాదులపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఒకటికి పది పిటిషన్లు వేస్తే ఎలా విచారించాలని ప్రశ్నిం చారు. సోమవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. విచారణలో ఏం గుర్తించారో చెప్పాలని తెలుపాలని న్యాయమూర్తిని చంద్రబాబు కోరారు. విచారణ దశలో బయట పెట్టలేమని న్యాయమూర్తి చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రాథమిక సాక్షాధారాలు ఏపీ సీఐడీ అందజేసిందని తెలిపారు. చంద్రబాబు తన న్యాయవాదుల ద్వారా ప్రాథమిక సాక్ష్యా ధారాలు తెలుసుకోవచ్చునని న్యాయమూర్తి చెప్పారు. ఈ కేసు విచారణతోనే అంతా ముగిసిపోయినట్లు భావించ వద్దని చంద్రబాబుకు చెప్పారు. విచారణ ప్రక్రియ ఇంకా చేపట్టాల్సి ఉందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos