కరోనా భయాందోళనకు ఉచిత కౌన్సెలింగ్

కరోనా భయాందోళనకు ఉచిత కౌన్సెలింగ్

తిరుపతి, మార్చి 31 : కరోనా ప్రభావం వల్ల భయాందోళనకు గురవుతున్న వారికి ఉచితంగా టెలి కౌన్సెలింగ్ చేయడానికి సిద్ధంగా వున్నానని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సున్నిత మనస్కులైన కొందరు భయపడి తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కు గురువుతున్నారని ఆయన చెప్పారు. ఇప్పటకే దీర్ఘకాలిక మానసిక రుగ్మతలతో బాధపడే వారు, వ్యసనపరులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. మధ్యం దొరక లేదని కర్నాటకలో నలుగురు, కేరళలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న విషయం వార్తల్లో వచ్చిందని చెప్పారు. విపరీతమైన కోపం, విసుగు, అనవసర భయాలు, అసంబద్ధ ఆలోచనలు, ఆత్మహత్యా భావాలు కృంగుబాటు,ఇతర మానసిక సమస్యలను కౌన్సెలింగ్ ద్వారా తగ్గించవచ్చని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలతో పాటు, ఇతర రాష్ట్రాల తెలుగు వారికి ఉచితంగా కౌన్సిలింగ్ చేయడానికి సిద్ధంగా వున్నాని చెప్పారు. అవసరమైన వారు తనను 9440584400 సెల్ నెంబరుకు ఫోన్ చేసి సంప్రదించ వచ్చని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos