వంద చిత్రాలు పూర్తయ్యాకే పెళ్లి….

  • In Film
  • February 14, 2019
  • 148 Views
వంద చిత్రాలు పూర్తయ్యాకే  పెళ్లి….

రెండవ ఇన్నింగ్స్‌లో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార దూసుకుపోతున్నారు.నయనతార
నటించిన,నటిస్తున్న చిత్రాలు స్టార్‌ హీరోలకు ధీటుగా క్రేజ్‌ తెచ్చుకుంటున్నాయంటే నయనతారకు
ఉన్న క్రేజ్‌ ఏంటో అర్థమవుతోంది.నాయిక ప్రాధాన్యత చిత్రాలతో పాటు భారీ వ్యయంతో నిర్మించే
చిత్రాల్లో నయనతారను తీసుకోవడానికే నిర్మాతలు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇటువంటి
సమయంలో నయనతార తన వివాహానికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.యువ
దర్శకుడు విఘ్నేష్‌తో కొద్ది కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న నయనతార వివాహాన్ని కొద్ది
కాలం పాటు వాయిదా వేయడానికి నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.నటిగా
అన్ని భాషల్లో వంద చిత్రాలు పూర్తి చేసాకే వివాహం చేసుకోవడానికి నయనతార నిర్ణయించుకున్నట్లు
వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటి వరకు అన్ని భాషల్లో 60పైగా చిత్రాల్లో నయనతార నటించింది.ప్రస్తుతం
మరో ఆరేడు చిత్రాల్లో నటిస్తోంది.ఈ ప్రకారం చూసుకుంటే నయనతార వంద చిత్రాల్లో నటించడానికి
మరో నాలుగైదేళ్లు సమయం పడుతుంది.నయనతార నిర్ణయం ఆమె అభిమానులకు ఉత్సాహం,సంతోషం కలిగించేదే
అయినా నయనతారను గాఢంగా ప్రేమిస్తున్న విఘ్నేష్‌ పరిస్థితి ఏంటని తమిళ సినీ వర్గాలు
చర్చించుకుంటున్నాయి. వంద చిత్రాలుపూర్తి చేసే పెళ్లి చేసుకుంటోందో లేక మనసుమార్చుకుని
ముందుగానే పెళ్ళిపీటలు ఎక్కుతుందో చూడాలి.కాగా గతంలో హీరో శింబు,డైరెక్టర్‌
ప్రభుదేవాలతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన విషయం తెలిసిందే.అందులోనూ ప్రభుదేవాతో
వివాహం వరకు వచ్చి బ్రేకప్‌ కావడంతో నయనతార చాలా కృంగిపోయినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.అయితే
వాటన్నింటిని అధిగమించి రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన నయనతార అనతికాలంలోనే మునుపటికంటే
మరింత స్టార్‌డమ్‌ను అందుకున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos